వాషింగ్‌ మెషీన్‌లో నక్కాడు.. చివరికి చిక్కాడు

accused caught in washing machine

15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు

ముంబై:  ఎవరికీ కనిపించకుండా పిల్లలు దాగుడు మూతలు ఆడతారు.  కానీ పోలీసుల కంటపడకుండా 15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని సోమవారం పట్టుకున్నారు. నేర నిరూపణ అయి తప్పించుకు తిరుగుతున్న వారిని పట్టుకోవాలని ముంబై పోలీస్‌ కమిషనర్‌ ఇటీవల పోలీసుల్ని ఆదేశించారు.  ఈ క్రమంలో పట్టుబడిన వ్యక్తి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.  జుహు ప్రాంతంలోని తన ఇం‍ట్లో వాషింగ్‌ మెషిన్‌లో నక్కిన 54 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. 

‘దాదాపు మూడు గంటలకు పైగా నిందితుని భార్య పోలీసుల్ని ఇంట్లోకి రానివ్వలేదు.  ఆ తరువాత ఇల్లంతా వెతికినా ఫలితం లేదు.  మేం వెళ్లిపోదామనుకున్నాం.  వాషింగ్‌ మెషీన్‌ నుంచి ఏదో వస్త్రం లోపలికి లాగుతున్నట్లు అనిపించింది. అది గమనించి అందులో దాక్కున్న నిందితున్ని పట్టుకున్నాం’  అని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.  ‘పట్టుబడిన వ్యక్తి రూ.లక్ష చీటింగ్‌ కేసులో దోషి.  బ్యాచిలర్‌ డిగ్రీలో ప్రవేశం​ కల్పిస్తానని ముగ్గురిని మోసం చేశాడు. పూణెలో కూడా కోటి రూపాయల స్కాం చేయాలనుకున్నాడు. కోర్టు 2002లో నిందితున్నిచీటింగ్‌ కేసులో ముద్దాయిగా పేర్కొనగా అప్పటినుంచి పరారీలో ఉన్నాడు’ అని ఆజాద్‌ మైదాన్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వసంత్‌ వాఖరే తెలిపారు. ప్రభుత్వాధికారుల్ని అడ్డుకున్నందుకు అతని భార్యపై కేసు నమోదైంది.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top