మటన్‌ సూప్‌తో హత్యకేసు గుట్టు వీడింది

mutton soup revals

నాగర్‌కర్నూలు హత్యకేసులో కొత్తకోణం

మటన్‌ సూప్‌తో హత్యకేసు గుట్టు వీడింది

 
హైదరాబాద్‌: సంచలనం సష్టించిన నాగర్‌కర్నూలు హత్యకేసులో కొత్తకోణం బయటపడింది. భర్త సుధాకర్‌రెడ్డిని హత్య చేసి ప్రియుడి రాజేశ్‌ను ఆ స్థానంలో పెట్టాలని స్వాతి పన్నిన పథకం ఎలా బయటపడిందన్న విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. స్వాతి ప్రియుడు రాజేశ్‌కు అలవాట్లే అతడు సుధాకర్‌రెడ్డి కాదన్న సంగతి తేల్చాయి. సాధారణంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వారికి ఆస్పత్రిలో మటన్‌ సూప్‌ ఇస్తుంటారు. అయితే కరణం కులానికి చెందిన రాజేశ్‌కు మాంసాహార తినే అలవాటు లేదు. హైదరాబాద్‌లోని అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్‌కు వైద్య సిబ్బంది మటన్‌ సూప్‌ ఇవ్వగా అతడు దాన్ని తాగేందుకు నిరాకరించాడు. మరోవైపు సుధాకర్‌రెడ్డి మాంసాహారం అంటే ఎంతో ఇష్టం. దీంతో సుధాకర్‌రెడ్డి కుటుంబసభ్యులకు కాస్త అనుమానం వచ్చింది. ఆ తర్వాత పోలికలు కూడా సరిపోలకపోవడంతో ఏదో జరిగిందనుకుని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఏమీ తెలియనట్లే ఆస్పత్రికి చేరుకుని స్వాతిని ప్రశ్నించడంతో భర్త సుధాకర్‌రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ నెల 9న స్వాతిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. రాజేశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు వేచిచూస్తున్నారు. ముఖానికి గాయాలు కావడంతో రాజేశ్‌ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగుపడటంతో ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసి నాగర్‌కర్నూల్‌లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  
 

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top