జేఎన్‌యూలో ఇక కనీస హాజరు తప్పనిసరి..!

minimum attendance mandatory for students: jnu

సర్క్యులర్‌ జారీ చేసిన యూనివర్సిటీ

వచ్చే అకడమిక్‌ నుంచి అమలు

ఢిల్లీ:  జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ప్రతి విద్యార్థికి కనీస హాజరు తప్పనిసరికానుంది.  డిసెంబర్‌ 22 న ఈ విషయమై జేఎన్‌యూ సర్క్యులర్‌ జారీ చేసింది.  వచ్చే విద్యా సంవత్సరం (2018 జనవరి) నుంచి రిజిస్టరైన ప్రతి విద్యార్థి కనీస హాజరు శాతాన్ని లెక్కించనుంది.  అయితే విద్యార్థులు ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

‘జేఎన్‌యూ విద్యార్థి సంఘ నాయకులను సంప్రదించ కుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు.  సర్క్యులర్‌లో అకడమిక్‌ కౌన్సిల్‌లో చర్చ జరిపాం అని ఉంది.  అది అబద్ధం.  కనీ​సం ఎజెండాలో కూడా ఆ విషయం ప్రస్తావించలేదు.  భవిష్యత్తులో ఆలోచిస్తాం అని మాత్రమే చెప్పారు’ అని జేఎన్‌యూ స్టూడెంట్‌ యూనియన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సిమోన్‌ జియోఖాన్‌ అన్నారు. 

ఆమె మాట్లాడుతూ.. గతంలో విద్యార్థులంతా క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేవారు. ఇటువంటి నిబంధనల అవసరం ఎప్పుడూ రాలేదన్నారు.  పాఠాలు వినడం మా విధి.  దానికి ఎవరి అజమాయిషీ అవసరం లేదన్నారు.  విద్యార్థి నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది.  మేం దీన్ని స్వాగతించం అని తెగేసి చెప్పారు.  సర్క్యులర్‌లో కనీస హాజరు నిబంధన మాత్రమే పేర్కొన్నారు.  ఎంత శాతం కనీస హాజరుగా పరిగణిస్తారో చెప్పలేదన్నారు.

నెల

సైబరాబాద్‌ కమిషనరేట్‌

రాచకొండ కమిషనరేట్‌  

మార్చి(2017)     

8                        

4

ఏప్రిల్‌                   

13                      5

మే                  

6                    3

జూన్‌                 

9             3

జూలై                  

11                            2

ఆగస్టు                  

10                             6

సెప్టెంబర్‌                 

6            6

అక్టోబర్‌  

16          2

నవంబర్‌             

10         1

డిసెంబర్‌             

9             7

జనవరి(2018)     

6                           5

ఫిబ్రవరి                  

4                        

3
Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top