గురు గ్రహ జెట్‌ ప్రవాహాల గమనాన్ని మార్చే గురుత్వ తరంగాలు​​

gravity waves change jupitre jetstreams course

సాక్షి : గురుత్వాకర్షణ తరంగాల కారణంగా వేగవంతమైన జెట్‌  ప్రవాహాలు గురు గ్రహ వాతావరణంలోకి ప్రవేశించి దాని గమనాన్ని మార్చివేసాయని శా​​​​​​​​స్త్రవేత్తలు గుర్తించారు . గతంలో  భూమి, శని గ్రహాల మీద కూడా ఇలాంటి జెట్‌ ప్రవాహాలని గుర్తించారు. వీటి వల్ల సాధరణ పవనాల గమనంలో మార్పులు వచ్చి2016 వాతావరణాన్ని అంచనా వేయడం కష్టమైంది.

భూమితో పోల్చినప్పుడు గురు గ్రహం చాలా పెద్దది, సూర్యుని నుంచి చాలా దూరంలో ఉంది, సూర్యుని చూట్టు చాలా వేగంగా తిరుగుతుంది, దీని నిర్మాణం చాలా విభిన్నంగా ఉంటుంది, భూమధ్య రేఖ దృగ్విషాయాన్ని అధ్యయనం చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుందని నాసా గొడార్డ్‌ స్పెస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలో రిక్‌ కాసెంటినో అన్నారు. 1883లో సంభవించిన క్రకటోవా అగ్ని పర్వతం విస్ఫోటనం చెంది, పశ్చిమ పవనాల వల్ల స్ట్రాటోస్పియర్‌ ఆవరణంలోకి ప్రవేశించాయిన శిథిలాలను పరిశీలించడం ద్వారా భూమధ్య రేఖ జెట్‌  ప్రవాహాలను గుర్తించడం జరిగింది.

  నాసా ఇన్‌ఫ్రారెడ్‌ టెలిస్కోప్‌ ద్వారా గురు గ్రహ వాతావరణాన్ని పరిశీలిస్తుంది. దీని 5సంవత్సరాల పరిశీలనలను కలిపి పరిశోధకులు ఒక కొత్త  నమూనాను రూపోందిస్తున్నారు. ఈ పరిశోధనల వల్ల శా​​​​​​​​స్త్రవేత్తలకు గురుడు, ఇతర గ్రహాలతో పాటు సౌరకుటుంబం వెలుపల ఉన్న గ్రహాల వాతావరణాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.

గురు గ్రహ చక్రాన్ని క్వాసీ-క్వాడ్రెన్యల్ ఆసిలేషన్ (QQO) అని పిలుస్తారు. ఇది నాలుగు ఎర్త్ సంవత్సరాల వరకు ఉంటుంది. పరిశోధకులు ఈ విధానాలపై ఇంతవరకు  సాధారణ అవగాహన కలిగి ఉన్నారు, అయితే ప్రస్తుతం వివిధ రకాలైన వాతావరణ తరంగాలు డోలనాలను నడపడానికి ఎలా  దోహదం చేస్తాయి, ఒకే విధమైన విషయాలు మిగితా వాటిల్లో ఎలా ఉన్నాయనే అంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

గురు గ్రహం మీద జరిపిన మునుపటి అధ్యయనాల్లో స్ట్రాటో ఆవరణంలో ఉష్ణోగ్రతలను గాలి వేగం మరియు దిశను అంచనా వేసి గుర్తించి, క్వాసీ-క్వాడ్రెన్యల్ ఆసిలేషన్ను గుర్తించారు. ప్రస్తుత అధ్యయనాల ద్వారా ఒక పూర్తి   క్వాసీ-క్వాడ్రెన్యల్ ఆసిలేషన్ చక్రంతో పాటు, గురు గ్రహం మీది ఎక్కువ భాగాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయని గ్రహాల వాతావరణ నిపుణుడైన గొడార్డ్‌ శా​​​​​​​​స్త్రవేత్త అమి సైమన్‌ అన్నారు.
బృహస్పతి భూమధ్యరేఖ స్ట్రాటో ఆవరణలో జెట్ ప్రవాహాలు  చాలా ఎక్కువగా ఉన్నాయని ఈ బృందం కనుగొంది.

వీరి నమూనాలో వెల్లడైన విషయం భూమి లోపలి వాతావరణంలో ఉష్ణసంవహనం వల్ల ఏర్పడిన గురుత్వ తరంగాలు క్వాసీ-క్వాడ్రెన్యల్ ఆసిలేషన్ దిశను మారుస్తాయి. భూమి మీద క్యూబీవో దిశను మార్చడానికి కూడా  గురుత్వ తరంగాలే  కారణమవుతున్నాయి,కానీ ఇవి ఒంటరిగా ఈ పనిని చేయలేవు అన్నారు.

Show Updated time: 
Back to Top