రజినీకి పోటీగా రాలేక...

allu arjun and mahesh babu cinema release date postponed because of rajini robo

రజినీ సినిమా అంటే ‘‘ఎనీ సెంటర్‌ సింగిల్‌ హ్యాండ్‌  ’’అన్నట్లుగా ఉంటుంది. ఎంత పెద్ద హీరో అయినా ఆయన సినిమా రిలీజ్‌ అవుతుంటే తమ సినిమాలు వాయిదా వేసుకుంటారు. ఇండియా మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న  ‘‘రోబో2.0’’ ఏప్రిల్‌27 విడుదల కానుంది. దేశం మొత్తం ఇదే రోజు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.   అన్ని భాషల డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ కూడా అమ్ముడుపోయాయి. అదే రోజున మహేష్‌ బాబు,అల్లు అర్జున్‌ సినిమాలు రిలీజ్‌ చేయాలనుకున్నారు. ‘‘రోబో2.0’’ సినిమా డేట్‌ అదే రోజు ఫిక్స్‌ అవ్వడంతో ఆరెండు సినిమాల నిర్మాతలు నెత్తి పట్టుకూర్చున్నారు. తెలుగు డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ కొన్న సునీల్‌ నారంగ్‌తో చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏం చేస్తారు సినిమా రిలీజ్‌ డేట్లను మార్చుకోక తప్పలేదు.
 

Show Updated time: 
Back to Top