చెన్నైలో స్వర మాంత్రికుడి ప్రదర్శన

AR Rahaman music concert in chennai

చెన్నై :  తమిళ అభిమానులను నూతన  సంవత్సరం  స్వర మాంత్రికుడు ఎ. ఆర్‌. రెహమాన్‌ తన గాన మాధుర్యంతో ఓలలాడించనున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత చెన్నైలో ప్రదర్శన ఇవ్వనున్నాడు.  సంగీత దర్శకునిగా  25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగీత కచేరీలు చేస్తున్న ఈ ఆస్కార్‌ విన్నర్‌.. తన సొంత గడ్డపై ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

వచ్చే ఏడాది జనవరి 12న  7యూపీ సంస్థ సమర్పణలో జరుగనున్న ఈ కన్సర్ట్‌కు విజ్‌క్రాఫ్ట్‌ ఇంటర్నేషనల్‌ ఎంటర్‌టేన్మెంట్‌  నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సంగీత దృశ్య మహోత్సవంలో రెహమాన్‌తో పాటు సింగర్స్‌ నీతి మోహన్‌,  హరిచరణ్‌, విజయ్‌ ప్రకాశ్‌ పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా ఎ. ఆర్‌. రెహమాన్‌ తన మనసులోని భావాల్ని అభిమానులతో పంచుకున్నారు. ‘గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న నా సంగీత ప్రయాణంలో ఎన్నో మరపురాని గుర్తులున్నాయి. నన్నింతగా  అభిమానిస్తూ, ఉత్సాహాన్నిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. నా హోమ్‌సిటీ చెన్నైలో ప్రదర్శన ఇవ్వటాన్ని గర్వంగా భావిస్తున్నాన’న్నారు.
 
విజ్‌క్రాఫ్ట్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌, సహ వ్యవస్థాపకుడైన సబ్బాస్‌ జోసెఫ్‌ మాట్లాడుతూ.. ‘ఎ. ఆర్‌. రెహమాన్‌కు సంబంధించిన అనేక ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా వ్యవహరించాము. తన  సంగీత ప్రస్థానంలో ఎంతో ప్రత్యేకమైన 25వ ఏట  తన మాతృభూమిలో ఇవ్వనున్న కచేరీలో భాగస్వాములవటం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మా సంస్థ తరపున రెహమాన్‌కు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాం..’ అన్నారు.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top