సుధీర్‌ - ఇంద్రగంటి కొత్త సినిమా

sudheer indraganti new movie

సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌బాబు, సక్సెస్‌ జోరు మీదున్న ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. ఇటీవలే హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్‌ జరిగింది. ఇటీవలే బాలీవుడ్‌లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు సుధీర్‌.  హిందీ ‘బాగీ’(తెలుగులో వర్షం సినిమా) రీమేక్‌లో విలన్‌గా నటించాడు.

ఇంద్రగంటి జెంటిల్‌మెన్‌ ఇచ్చిన సక్సెస్‌లో ఉన్నారు. మళ్లీ ఒక అందమైన ప్రేమకథను రూపొందిస్తున్నట్లు సమాచారం. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, జెంటిల్‌మెన్‌ లాంటి ఫీల్‌గుడ్‌ మూవీస్‌ తీశారు. సుధీర్‌ నటిస్తున్న ఈ సినిమాకు సమ్మోహనం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో సుధీర్‌ పక్కింట అబ్బాయిలా,  సరదాగా ఉండే  పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్‌ భామ అదితి రావ్‌ తెలుగు తెరకు పరిచయం కానున్నారు.
 

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

సంబంధిత వీడియోలు

Back to Top