‘పద్మావత్‌’ కూ తిప్పలు తప్పవా.....?

will padmavath also faces the problems?

జైపూర్‌ : అన్ని ఇబ్బందులు దాటుకుని ఈ నెల25ను రిలీజ్‌ తేదీగా ప్రకటిద్దామనుకునే వేళ ‘పద్మావత్‌’ సినిమాకు మరో ఇబ్బంది ఎదురుకానుంది. కేవలం సినిమా పేరును మాత్రమే మారిస్తే సరిపోదు, సినిమాలోని పాత్రదారుల పేర్లను కూడా మార్చాలని రాజ్‌పుత్‌ కర్ణిసేన ప్రస్తుతం డిమాండ్ చేస్తుంది‌. ఈ సందర్భంగా కర్ణిసేన సభ్యుడు మణిపాల్‌ సింగ్‌ మకర్ణ ఎఎన్‌ఐతో మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విషయంలో మేము ముందునుంచి ఒకే మాటకు కట్టుబడి ఉన్నాం, మొదటినుంచి మేము ఈ సినిమాను నిషేధించమనే కోరుతున్నాము. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌  ఏర్పాటు చేసిన కమిటీ వారు కూడా ఈ సినిమా బాగా లేదని, చరిత్రని వక్రీకరించారని, కేవలం డబ్బుల కోసమే ఈ సినిమాను తీశారని నివేదించారని’’ అన్నారు. శాంతి భద్రతల అంశాలను దృష్టిలో ఉంచుకుని మేము ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాన్ని నేను ప్రధాని నోటిసుకు కూడా తీసుకెళ్తాను, లేదంటే సినిమా విడుదల తర్వాత జరిగే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి  ఉంటుందని అన్నారు. అదే విధంగా సీబీఎఫ్‌సీ ముఖ్య అధికారి జోషిని, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మ్రితి ఇరానీని, రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోర్‌ను రాజీనామ చేయాలని డిమాండ్‌ చేశారు.
 

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top