నితిన్‌ జీ కాంగ్రెస్‌లోకి రండి : హార్ధిక్‌ పటేల్‌

‍hardik invites nithin patel to join congress

న్యూఢిల్లీ : గుజరాత్‌లో  ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి, శాఖల కేటాయింపులతో కొత్త చిక్కొచ్చి పడింది. ఈ క్రమంలో పటీదార్‌ లీడర్‌ హార్ధిక్‌ పటేల్‌ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. అధికార బీజేపీని వదిలి, కాంగ్రెస్‌లో చేరాలంటూ గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌కు సూచించారు.

‘ 10 మంది ఎమ్మెల్యేలతో పాటు నితిన్‌ పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లయితే ఆయనకు పార్టీలో ఉన్నత స్థానం కల్పించే బాధ్యతను తీసుకుంటాను. బీజీపీలో సముచిత స్థానం, గౌరవం లేనపుడు ఆ పార్టీని వీడడమే ఉత్తమం’ అని హార్ధిక్‌ వ్యాఖ్యానించారు.

సీఎం విజయ్‌ రూపానీ నేతృత్వంలో కొలువుదీనరిన క్యాబినెట్‌లో, నితిన్‌ పటేల్‌కు రోడ్లు- భవనాలు, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖలతో పాటు వైద్య విద్య వంటి ప్రాధాన్యంలేని శాఖలను కేటాయించటం పట్ల నితిన్‌ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో హార్ధిక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, పట్టణాభివృద్ధి వంటి ప్రధాన శాఖలు నిర్వహించిన నితిన్‌ భాయ్‌, ప్రస్తుతం కేటాయించిన శాఖ వల్ల అవమానభారంతో రగిలిపోతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఈ అంశంఆధారంగా, పటేళ్ల​ ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న బీజేపీని వీడాలంటూ హార్ధిక్‌ హితవు పలికారు. ఇక్కడ ​​​​​​​​​విశేషమేమిటంటే.. ఈసారి కూడా పటీదార్‌ సామాజిక వర్గానికి చెందిన సౌరభ్‌ పటేల్‌కే ఆర్థిక శాఖను కేటాయించారు.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top