సైకిలెక్కిన సోనియా

Bollywood actor Riteish Deshmukh. The actor took to Twitter to post a picture of a visibly relaxed Sonia Gandhi

 న్యూఢిల్లీ: ఇదేంటి సోనియాకు సైకిల్‌ ఎక్కే అవసరం ఏముంది? ఎక్కడికైనా వెళ్లలంటే ఖరీదైన కారులో వెళ్లొచ్చు. ఇంకా అత్యవసరమనుకుంటే విమానంలో వెళ్లొచ్చు. కానీ సైకిల్‌పై ఎక్కడి వెళ్లారా అనుకుంటున్నారా..? ఎక్కడి వెళ్లలేదండి బాబూ.. గోవాలో సరదాగా కాసేపు సైకిల్‌ తొక్కారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. పార్టీ పూర్తి బాధ్యతలను రాహుల్‌ కి అప్పజెప్పి  గోవా టూర్‌కి వెళ్లారు. అక్కడ సైకిల్ తొక్కుతున్న సోనియా ఫోటోను బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు అందరూ రితేశ్‌ దేశ్‌ముఖ్‌కి థాంక్స్‌ చెబుతున్నారు. ఆయన ఫోటో పోస్ట్‌ చేస్తూ..‘‘ కొన్ని ఫోటోలు చూస్తే సంతోషంగా ఉంటుంది. అలాంటి ఫోటోనే ఇది’’ అని చిరునవ్వుతో సైకిల్‌ తొక్కుతున్న సోనియా ఫోటోని ట్వీట్‌ చేశారు. 

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top