రెండు గంటల్లో ఆరుగురి హత్య

 ex-Army Murders 6 People With Iron Rod in 2 Hours

మాజీ సైనికుడి ఘాతుకం

చంఢీగఢ్‌‌:  ఒకే వ్యక్తి రెండు గంటల్లో  వేరు వేరు చోట్ల ఆరుగురిని హత్య చేసిన ఘటన హరియాణాలో చోటుచేసుకుంది.ఇనుప కడ్డీతో విచక్షణరహితంగా దాడి చేసి ఆరుగురిని హతమార్చాడు.పోలీసులు  సీసీ కెమోరాల ద్వారా ఆ వ్యక్తిని గుర్తించి అరెస్టుచేశారు.  వివరాల్లోకి వెళితే..హరియాణాలోని పాల్వాల్‌  పట్టణ ప్రాంతంలో నివసించే నరేష్‌ ధన్ఖర్‌ (45) సోమవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో పాల్వాల్‌లోని ఓ  ఆసుపత్రికి వెళ్లి అంజుమ్‌ అనే మహిళను ఇనుప కడ్డీతో దాడి చేసి హత్య చేశాడు. అక్కడి నుంచి తప్పించుకుని ఆగ్రారోడ్‌, మినార్‌ గేట్‌ వద్దకి వెళ్లి ఐదుగరిపై దాడి చేశాడు. వారిలో నలుగురు మరణించారు. తదనంతరం రసుల్‌పూర్‌లో ఓ ఇంజనీరింగ్‌ వర్క్‌షాప్‌ కాపలాదారుడిపై దాడిచేసి హత్య చేశాడు.ఈ ఘటనపై పల్వాల్‌ సుపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సులోచన గజ్రాజ్‌ మాట్లాడుతూ.. ‘నరేష్‌ ధన్ఖర్‌ మతిస్థిమితం లేని వ్యక్తి. అతను దాడికి గురైన ఓ వ్యక్తి అతను  మాజీ సైనికుడని గుర్తించాడు. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గాయాలతో ఉన్న నరేష్‌ను అతి కష్టం మీద పట్టుకున్నాం.అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడ’ని పేర్కొన్నారు.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top