లాలూ కేసులో సంచలన తీర్పు

judgement gives against lalu by cbi spicial court

రాంచీ: దాణా కుంభకోణం కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్షను ఖారారు చేసింది. ఎంతో ఉత్కంఠ తర్వాత ముద్దాయికి మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా విధించింది. ఎన్నో ఆరోపణల నడుమా 2013లో ప్రత్యేక కోర్టు లాలును దోషిగా తెలుస్తూ ఐదు సంవత్సరాలు శిక్ష వింధించిన సంగతి తెలిసిందే. లాలూ ప్రసాద్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.89 లక్షలకు పైగా సోత్తు అక్రమంగా కాచేసినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న లాలును దోషిగా తెలుస్తూ శిక్ష విధించింది. 69 ఏళ్ల లాలు ప్రస్తుతం పాట్నాలోని బీర్సా ముండా జైల్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు. తీర్పు వెలువడిన అనంతరం లాలు కూమారుడు తేజస్విమాదవ్‌ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సమావేశంలో తేజశ్వీయాదవ్‌  మాట్లాడుతూ... చట్టం తనపని తను చేస్తుందని బేయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Show Updated time: 
Back to Top