లాలూ రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనా?

lalu prasad political life on strugul

రాంచీ:  బీహార్‌ రాజకీయ కురవృధ్దుడు అర్ధశతాబ్ధంపాటు దేశ రాజకీయల్లో ఆరితేరిన లాలూ ప్రసాద్‌ రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనా?​. దాణా కుంభకోణం కేసులో లాలూ ఊహించని  విధంగా మూడున్నరేళ్లు శిక్ష పడిన నేపథ్యంలో  తన రాజకీయ ప్రస్థానం గురించి పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. బీహార్‌ రాజకీయల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు.  ప్రస్తుతం లాలూ రాజకీయ జీవితం చరమాంకంలో పడింది. రెండు దశాబ్దాలుగా నీతీష్‌కూమార్‌తో సాగిన యుద్దనికి తెరదింపి గత ఎన్నికల్లో ఇద్దరూ ఏకమై పోటి చేసి, బీహార్‌లో ప్రభుత్వాని ఏర్పాటు చేశారు. ఇది ఒక విధంగా మోదీకి సవాల్‌ విసిరినట్టే. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా  లాలూ నేతృత్వంలోని ఆర్‌జేడీ 80 స్థానాలలో విజయం సాధించి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

లాలూ మీద కేసులు ఉండి పోటికి దూరంగా ఉన్నకారణంగా ముఖ్యమంత్రిగా నితిష్‌కూమార్‌కు అవకాశం వచ్చింది. దేశమొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తున్న విరీ దోస్తానా​ ఎంతకాలమో సాగలేదు. మోదీని తీవ్రంగా వ్యతీరేకించే నితిష్‌కూమార్‌ లాలూకి పంగనామాలు పెట్టి ఎన్‌డీఎ కూటమిలో చేరీ అనుహ్యానిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ లాలూ కుటుంబం మీద వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో తన కూమారుడు ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌ను పదవికి రాజనామా చేయాలన్న నీతిష్‌ విన్నపాన్నీ లాలూ తోసిపుచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో లాలూతో కలిసి ప్రభుత్వాన్నీ నడిపించలేమని నీతిష్‌ రాజీనామా చేశారు.  దీనిని సైలెంట్‌ గమనిస్తూన్న బీజేపీ వేంటనే నీతిష్‌కు మద్దతిస్తున్నట్లు ముందుకొచ్చింది. దీని అంతటికి కారణం కేంద్రంలోని బీజేపీ కక్ష్యపూరిత చర్యల్లో భాగమని తనను ఎదుర్కొలేక ఈడీతో దాడులు చేసి తన మీద అక్రమ కేసులు పెట్టిందని లాలూ బహిరంగగానే మోదీని విమర్శించారు.

ముందునుంచి ఎన్‌డీఎ కూటమీలో భాగంగా ఉన్న జేడీయూ అధినేత నీతిష్‌ 2014లో బీజేపీ ప్రధాన అభ్యర్థిగా  మోదీని ప్రకటించడంతో నిరాశకుగురైన నీతిష్‌ తన 18ఏళ్ల కషాయ బంధాన్ని తెంచుకున్నీ తన ప్రధాన  రాజకీయ  శత్రువుగా భావించే లాలూతో చేతులుకలిపి దేశం మొత్తం అశ్చర్యనికి గురిచేశారు. దీనితో రాజకియంలో శాశ్వత మిత్రులుగానీ, శత్రువులుగానీ​ ఉండరని వీరిద్ధరూ నీరూపించారు. ప్రస్తుత 69 ఏళ్ల లాలూ దాణా కుంభకోణం కేసులో దోషిగా తెలడంతో మరోసారి జైలు జీవితం గడపక తప్పడం లేదు. మూడున్నరేళ్లు శిక్ష పడటంతో  లాలూ రాజకీయా జీవితం ప్రశ్నార్థకంగా మారింది. తన రాజకీయ వారసులుగా తేజస్వీ యాదవ్‌, తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌లు ప్రసుత్తం రాజకీయల్లో వోనమాలు నేర్చుకుంటున్నారు. బీహార్‌లో లాలూకు ఉన్న చరిస్మాతో మరో పదిపదిహేనేళ్లు తనకు ఎదురేలేదనుకున్న తరుణంలో కోర్టు తీర్పు తననూ తీవ్ర నిరాశకు గురిచేసింది. 

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top