పద్మావతికి లైన్‌క్లియర్‌

line clear to padmavathi movie

న్యూఢిల్లీ: సంజయ్‌లీలా భన్సాలీ ప్రతీష్టాత్మక చిత్రం పద్మావతికి ఎట్టకేలకు  లైన్‌క్లియర్‌ అయ్యింది. గతకొంత కాలంగా ఎన్నో వివాదాలాకు మూలం అవుతున్న చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. విడుదలకు కావల్సిన సీబీఎఫ్‌సీను సర్టీఫికెట్‌ను పోందింది. సినిమాను వీక్షించిన బోర్డు సభ్యులు చిత్రానికి 26 కటింగ్స్‌ చేశారు. సినిమా పేరును పద్మవత్‌’గా మార్చుకోవాలని సూచించింది. గతకొంత కాలంగా అనేక వివాదాలు, విమర్మల మధ్య చిత్రం విడుదల ఆగిపోయిన విషయం తెలిసిందే.

సంజయ్‌లీలా 190 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతీష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నచారిత్రాత్మక చిత్రం మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. చరిత్రను వక్రీకరించి సినిమా తీస్తున్నారని దేశవ్యాప్తంగా కర్ణిసేన తీవ్రంగా వ్యతిరేకించింది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ చిత్రం 13వ శతాబ్దంలో చిత్తోర్‌ రాజ్యాంపై అల్లావుధ్దిన్‌ ఖిల్జీ దండెత్తి పద్మినిని వశపరుచుకున్నాడన్నది ఈ చిత్ర నేపథ్యం. చరిత్రను పూర్తిగా వక్రికరించి సినిమా తీశారని తమ  మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా దేశంలోని రాజ్‌పుత్‌లు తమ రాణి పద్మిని వ్యక్తిత్వాన్ని పూర్తిగా కించపరిచే విధంగా సినిమా ఉందంటూ చిత్ర యూనిట్‌పై దాడులు చేసిన విషయం​ తెలిసిందే. బీజేపీ పాలిత రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రలు ఇప్పటికే సినిమాను బ్యాండ్‌ చేసున్నట్లు ప్రకటించాయి.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top