జుట్టు కోసం ప్రాణాలు విడిచాడు..!

man died of suicide for hairfall

పెళ్లి కాదేమోనని బెంగ..

మధురై: ఎంతగా ప్రయత్నించినా తన జుట్టు రాలటం తగ్గడం లేదని ఓ వ్యక్తి  ఆత్మహత్య చేసుకున్నాడు.  పోలీసుల వివరాల ప్రకారం.. జైహింద్‌పురం కు చెందిన ఆర్‌.మిథున్‌ రాజ్‌ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.  తలపై జుట్టు విపరీతంగా రాలడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 

ఎన్ని మందులు వాడినా ఫలితం కనపడలేదు.  ఈ కారణంగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు.  ఇదే విషయమై చాలా సార్లు తల్లితో తన బాధను చెప్పుకున్నాడు.  తల్లి ఇంట్లో లేనిది చూసి.. తీవ్ర నిరాశలో ఆదివారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.  తల్లి వాసంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని​ దర్యాప్తు చేస్తున్నారు.
 

Show Updated time: 
Back to Top