ఇద్దరు మేనేజర్ల అరెస్టు

Mumbai Police arrest two managers of 1 Above lounge

ముంబై: కమలా మిల్స్‌లోని వన్ ఎబోవ్ లాంజ్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఘటనలో ముంబై పోలీసులు ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేశారు. ఆ ప్రమాదంలో సుమారు 14 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. వన్ ఎబోవ్ పబ్ మేనేజర్లు కెవిన్ బావా, నితీష్‌ లను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆ ఇద్దరూ పబ్‌లోనే ఉన్నారు. అయితే కస్టమర్లకు ఎటువంటి సాయం చేయకుండానే వారు పారిపోయారని పోలీసులు పేర్కొన్నారు.వీరి అరెస్టుకు ఒక్క రోజు ముం‍దే వన్ ఎబోవ్ లాంజ్‌ యజమానులైన క్రిపెష్‌, జిగర్‌ సంఘ్వీలను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు.బ్రిహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌  ఫిర్యారు మేరకు లాంజ్‌ సహ యనమాని అభిజిత్‌ మాంకాపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.ఇదిలా ఉండగా ముంబైలోని అక్రమ కట్టడాలను కూల్చివేసే కార్యక్రమాన్ని నగర మున్సిపల్‌ శాఖ చేపట్టింది. నిబందనలకు వ్యతిరేకంగా నిర్మించిన కట్టాలన్నింటిని కూల్చి వేయనున్నట్లు మున్సిపల్‌ కమీషనర్‌ అజయ్‌ మెహతా పేర్కొన్నారు.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top