పక్కా పథకం ప్రకారమే మర్డర్‌ ...

preplanned murder

తానే :  మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నవ్యక్తి పై వాహనాన్ని  ఎక్కించి చంపిన సంఘటనలో ఓ మహిళతో పాటు మరోఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పక్కా పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. రామ్‌ జీ చత్రథరి శర్మ(46) స్ధానికంగా ఓ సెలూన్‌ను నడుపుతున్నాడు. నవంబర్‌ 18 న తానేలోని అజాద్‌నగర్‌లో మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా అతని పై నుంచి ఓ వాహనం దూసుకెళ్లింది అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఇది పథకం ప్రకారం  చేసిందయి ఉంటుందని అనుమానించి థర్యాప్తు చేపట్టాం. ఈ ఘటనకు సంబంధించిన వాహనానికి  తర్వాత రిపేర్లు,పేయింటింగ్‌ చేయించడం అనుమానాలకు బలాన్నిచ్చాయి అని పోలీసులు అన్నారు.

మృతుడి కాల్‌ డేటా, ఇతరులు చెప్పిన దాని ప్రకారం అతను ఓ మహిళను వేధించేవాడని విచారణలో తేలింది అని పోలీసులు తెలిపారు.  ఆ మహిళ,సుమరి సురేష్‌ యాదవ్‌ అతనితో పాటు ఇంకో వ్యక్తి కలిసి శర్మను చంపేయాలని పథకం వేసుకున్నారు. అనుకున్న దాని ప్రకారం కారును శర్మపై ఎక్కించి హత్య చేశారు.ఈ హత్యతో సంబంధం ఉన్న రెండో వ్యక్తిని జయ ప్రకాశ్‌ ముంగ్రు చావన్‌(32)గా గుర్తించాము.ఇద్దరిని అరెస్టు చేసి వారిపై హత్య కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
 

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top