హిమాచల్‌ ఫలితాలపై నేడు రాహుల్‌ సమీక్ష

 Rahul Gandhi To Review Himachal Pradesh

న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై నేడు రాష్ట్ర పార్టీ  నేతలతో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ  చర్చించనున్నారు. ఇటివల వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఎన్నికల్లో  ఓటమికి గల కారణాలను ఎంఎల్‌ఏలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో, కార్యకర్తలతో కలిసి సమీక్షించనున్నారు. సిమ్లాలోని రాజీవ్‌భవన్‌లో రాహుల్‌ అధ్యక్షతన  జరిగే ఈ సమావేశంలో వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారు. ఇటివల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్‌ కేవలం 21 సీట్లకే పరిమితమై, 44 స్థానాలలో బీజేపీ విజయం సాధించింన విషయం తెలిసిందే.

Show Updated time: 

సంబంధిత వీడియోలు

Back to Top