కోర్టు ముందు హాజరైన త్యాగీ

on Wednesday  S.P. Tyagi appeared before court

న్యూ ఢిల్లీ : మల్టీ-మిలియన్‌ డాలర్ల విలువైన అగస్టా వెస్ట్‌లాండ్‌ ఒప్పందం కేసులో భారత మాజీ వాయుసేన చీఫ్‌ ఎస్‌పీ త్యాగీ బుధవారం కోర్టు ముందు హాజరయ్యారు. త్యాగీతోపాటుగా అతని తమ్ముడు సంజీవ్‌ అలియాస్ జూలీ, మాజీ ఎయిర్‌ మార్షల్‌ జె.ఎస్‌ గుజరాల్‌, న్యాయవాది గౌతమ్‌ ఖైటాన్‌ సీబీఐ ప్రత్యేక న్యాయవాది అరవింద్‌ కుమార్‌ ముందు హాజరయ్యారు.

జడ్జీ కుమార్‌ ఈ నెల 11న  నిందితులను డిసెంబర్‌ 20న కోర్టు ముందు హాజరుకమ్మని ఆదేశించారు. చార్జీషీటు కాపీలను నిందుతులకి ఇవ్వమని కోర్టు  సీబీఐని ఆదేశించింది, తదుపరి విచారణను మే 30, 2018కి వాయిదా వేసింది.2లక్షల పూచీకత్తు మీద  కోర్టు గుజ్రాల్‌కి  బెయిల్‌ మంజూరు చేసింది, కానీ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచిపోవద్దని ఆదేశించింది.​ ఖైతాన్‌ తరుపు న్యాయవాది పి.కె.దూబె, అతనికి జనవరి 2018 లో హాంగ్‌కాంగ్, ఫిలిప్పై​న్లకు ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. కోర్టు  ఈ దరఖాస్తును శుక్రవారం పరిశీలించనుంది.

  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూరోపియన్‌ మధ్యవర్తి కార్లో గెరోసాను అప్పగించమని కోరినట్లు సీబీఐ కోర్టుకి తెలియజేసింది. సెప్టెంబరు 1 న త్యాగీ, సంజీవ్, గుజ్రాల్, ఖైతాన్, ఇటాలియన్ రక్షణ మరియు అంతరిక్ష ప్రధానమైన ఫిన్మెకనికా మాజీ చీఫ్ గియుసేప్ ఓర్సీ, మాజీ అగస్టా వెస్ట్లాండ్ సీయివో బ్రునో స్పగ్నోలి తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూరోపియన్‌ మధ్యవర్తులు మిడిల్ క్రిస్టియన్ మిచెల్, గైడో హాష్కే మరియు గెరోసా, ఫిన్మెకానికా యొక్క అనుబంధ సంస్థ అగస్టా వెస్ట్‌లాండ్, ఐడీఎస్‌ ఇన్ఫోటెక్ ల మీద సీబీఐ చార్జీషీట్‌ను నమోదు చేసింది. 

భారతీయ అధికారులకు లంచం ఇచ్చి అక్రమంగా కాంట్రక్టు పొందినందుకు గాను ఇటలీ కోర్టు ఓర్పి, స్పాగ్నోలినిని ఇంతకు ముందే శిక్షించింది. 2004 నుంచి 2007 వరకు ఐఎఫ్‌ చీఫ్‌గా పనిచేసిన త్యాగీ, అతని సోదరుడు సంజీవ్‌, ఖైతాన్‌ మీద యూకేకు చెందిన అగస్టా వెస్ట్‌లాండ్ 12ఎడబ్ల్యూ -101 వీవీఐపీ హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో  అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరిని 2016 డిసెంబర్‌లో అరెస్టు చేశారు, ప్రస్తుతం వీరు బెయిల్‌ మీద ఉన్నారు. త్యాగీ, ఇతరులు అగస్టా వెస్ట్‌లాండ్‌ కంపెనీ నుంచి ముడుపులు తీసుకుని, కాంట్రాక్టు ఆ కంపెనీకి వచ్చేలా చేశారని ఆరోపిస్తూ మార్చి 12, 2013న సీబీఐ వీరి మీద నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంల కింద ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. అగస్టా కంపెనీ కన్సల్టేన్సి  సేవల పేర్లతో  వివిధ కంపెనీల నుంచి ముడుపులను స్వీకరించిందని సీబీఐ వారు తెలిపింది.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

సంబంధిత వీడియోలు

Back to Top