పెళ్లితో కోహ్లిలో మార్పు..! : రోహిత్‌

Will marriage change virat life

న్యూఢిల్లీ: పెళ్లితో ఇన్ని రోజులు సరదాగా గడిపిన విరాట్‌ ఇక  దక్షిణాఫ్రికా  టూర్‌కి సిద్ధమయ్యాడు. వివాహం తర్వాత తొలి మ్యాచ్‌ ఆడబోతున్న విరాట్‌కి రోహిత్‌ శర్మ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఓ ఇంగ్లిష్‌ చానల్‌తో మాట్లాడుతూ...పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తెస్తుంది. తన జీవితంలోకి రితిక వచ్చాక చాలా  మార్పు వచ్చిందన్నాడు. పెళ్లి రోజు (డిసెంబర్‌13) డబుల్‌ సెంచరీ చేసి తనదైన స్టైల్‌లో రితిక కి బహుమతి ఇచ్చిన రోహిత్‌ .. వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే అద్భుత ఘట్టం అన్నాడు. విరాట్‌ జీవితంలో పెళ్లి మార్పు తెస్తుందా? అని అడగ్గా...ఇది చెప్పడం చాలా కష్టం. సమాధానం చెప్పలేను. బహుశా దక్షిణాఫ్రికా పర్యటనలోనే అది జరగొచ్చు..అంటూ నవ్వుతూ సెలవిచ్చాడు మాంచి ఫామ్‌లో ఉన్న మన ఓపెనర్‌.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top