మాటా మాటా పెరిగి.. ఉరి వేసుకుంది

woman committed suicide arguing with husband

భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య

నొయిడా:  భర్తతో గొడవపడి మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది.  వివరాల్లోకి వెళితే.. సార్ణబి బిస్వాస్‌ (26) కు ఏడాది క్రితం అపూర్వతో వివాహం జరిగింది.  అపూర్వ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు.

భార్యాభర్తలు 123 సెక్టార్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఏడాదిగా ఉంటున్నారని..  బుధవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో బిస్వాస్‌ ఆత్మహత్య చేసుకుందని ఫేజ్‌ 3 పోలీస్‌ హౌజ్‌ ఎస్‌హెచ్‌ఓ  జితేంద్ర కుమార్‌ తెలిపారు.  పశ్చిమ బెంగాల్‌లో ఉంటున్న మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామన్నారు. దర్యాప్తు జరుగుతోందని జితేంద్ర వివరించారు.

Show Updated time: 
Back to Top