బీజేపీ నుంచి బయటికిరండి : హార్దిక్‌ పటేల్‌

Patidar leader Hardik Patel invites Gujarat deputy CM Nitin Patel to join him

గుజరాత్‌ డిప్యూటీ సీఎంకు హర్థిక్‌ పటేల్‌ పిలుపు

గాంధీనగర్‌ : గుజరాత్‌లో పొలిటికల్‌ డ్రామా మొదలైంది. ఈ నెల 18న వెలువడిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో, చావు తప్పి కన్నులొట్టపొయి 99 సీట్లతో గెలిచి, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయ్‌ రూపాని ముఖ్యమంత్రిగా, నితిన్‌ పటేల్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ వద్ద ఉన్న ఆర్థిక, పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖలు దక్కలేదు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. బీజేపీ తన పార్టీ సీనియర్‌ నేతను అవమానిస్తుందని, పటేల్‌ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కన్వీనర్‌ హార్దిక్‌ పటేల్‌ వ్యాఖ్యనించారు. నితిన్‌ పటేల్‌ను బీజేపీ అవమానిస్తుందని, నితిన్‌ బయటికొస్తే ఆయనతో పాటు మరో పది మంది ఎమ్మేల్యేలు బయటికొస్తారని, కాంగ్రెస్‌ పార్టీతో మాట్లాడి నితిన్‌కు ఉన్నత స్థానాన్ని కల్పిస్తానని తెలిపారు.

దీనిపై  గుజరాత్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు భరత్‌సిన్హా స్పందిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ జరుగుతున్న పరిణామలను గమనింస్తుందని, ఆనందీబెన్‌ పటేల్‌, ఇప్పడు నితిన్‌ పటేల్‌ను భారతీయ జనత పార్టీ  అధీష్టానం టార్గెట్‌ చేసిందని విమర్శించారు. భరత్‌సిన్హా ఒక అడుగు ముందుకేసి బీజేపీ పార్టీ నుంచి నితిన్‌ పటేల్‌ మరికొంత మంది ఎమ్మేల్యేలు బయటికొచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరితో గుజరాత్‌ అభివృద్ధి కోసం తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 
 

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top