ఎంపీని బ్లాక్‌ చేసిన సుష్మా స్వరాజ్‌

sushma swaraj blocked my twitter account says congress mp

నూ ఢిల్లీ : విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తనను ట్లిట్టర్‌లో బ్లాక్‌ చేసిందని కాంగ్రెసు ఎంపీ ప్రతాప్‌ సింగ్‌ బజ్వా తెలిపారు. ఇందుకు సంబంధించిన స్ర్కీన్‌ షాట్‌లను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. విదేశాంగ మంత్రి  తనని బ్లాక్‌ చేయడం ద్వారా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే  ప్రయత్నం చేస్తున్నారని,  ఏదైనా అంశం గూర్చి అడిగితే ఒక పార్లమెంటు సభ్యుని ఖాతాను బ్లాక్‌చేస్తారా అని ప్రశ్నించారు.  ఇదేనా ఒక మంత్రి వ్యవహరించే తీరు అని సుష్మా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

2014లో ఇరాక్‌లో అపహరణకు గురయిన 39 మంది భారతీయుల విషయంలో ఇద్దరి నేతల మధ్య అప్పటి నుంచి వాగ్యూద్ధం నడుస్తూనే  ఉంది. గతంలో దీనిపై  సుష్మా స్వరాజ్‌ పార్లమెంటులో మూట్టాడుతూ ఐసిస్‌ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన భారతీయులు  ప్రస్తుతం బాదుష్‌ జైలులో ఉన్నట్టు ఇరాక్‌ అధికారులు సమాచారమిచ్చినట్టు తెలిపారు. అపహరణకు గురైన వారిని మరణించినట్టు ప్రకటించడం చాలా తెలికైన పనని కానీ తాను అలా చేయబోనన్నారు. అలా చెప్పిన నన్నెవరూ ప్రశ్నించే వారు లేరన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా అలా చెప్పడం సమంజసం కాదన్నారు.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top