‘‘మెట్రో’’ మా పెళ్లి చేసింది...

metro helped for wedding in kerala

కొచ్చి : ఎవరి పెళ్లైనా పంతులు చేస్తాడు మెట్రో పెళ్లిళ్లు చేయడం ఏంటి అనుకుంటున్నారా. ఈ రియల్‌ స్టోరీ సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది. ఈవిషయాన్ని  కొచ్చి మెట్రొ తన అఫిషియల్‌ ఫేస్‌ బుక్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసింది. కేరళలకు చెందిన ఓ పెళ్లి జంట పెళ్లిమండపానికి వెళ్లడానికి పాలక్కడ్‌–ఎర్నాకులం 130 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చింది.  అన్ని పక్కాగా ప్లాన్‌ చేసుకుని బయలుదేరారు. రోడ్డు భూతం అదే ట్రాఫిక్‌ వాళ్లను 30కిలోమీటర్ల దూరంలోనే వాళ్లను నిలబెట్టేసింది. పెళ్లి ముహుర్తం దగ్గరపడుతోంది చాలా దూరం ప్రయాణం చేయాలి ఇక పెళ్లి ముహుర్తానికి జరగనట్లేనా అనుకున్నారంతా.

ఇంతలో ఎవరో ‘‘మెట్రో రైలు’’లో వెళ్లండి అని సలహా ఇచ్చారు. అక్కడకూడా టిక్కెట్‌ కౌంటర్‌ దగ్గర క్యూలో చాలా మంది నిలబడి ఉన్నారు. ఏం చేస్తాం పెళ్లి కొడుకే రంగంలోకి దిగాల్సివచ్చింది. అయ్యా బాబు ఈ రోజు నా పెళ్లి సమయానికి పెళ్లి మండపానికి చేరుకోవాలి కొంచెం సహాయం చేయండి అని బతిమాలుకున్నాడు.  ఎలాగైతేనేం టిక్కెట్లు సాధించింది అనుకున్న సమయానికి మెట్రో పుణ్యమా అని పెళ్లి చేసుకోగలిగాడు. ఇలా ఓ జంట పెళ్లికి మెట్రో సహాయం చేసింది.
 

Show Updated time: 
Back to Top