దక్షిణాఫ్రికా బయలుదేరిన విరుష్కా జోడి

virat anushka off to sothafrica

ముంబయి : భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, తన భార్య అనుష్కతో కలిసి గురువారం తెల్లవారుజామున దక్షిణాఫ్రికాకు బయలుదేరారు. కోహ్లీతో పాటు ఇతర అటగాళ్లు కూడా  ముంబయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి దక్షిణాఫ్రికాకు పయనం అయ్యారు. జనవరి 5 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరగనున్న సిరీస్‌లో భాగంగా దక్షణాఫ్రికాతో భారత్‌ 6 టెస్టులు, 3 వన్డేలు, 3 ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడనుంది. పెళ్లి కారణంగా శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉన్న కోహ్లీ ఈ టూర్‌లో తిరిగి జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు.

నూతన సంవత్సర వేడుకలను విరుష్కా జోడి అక్కడే జరుపుకొనుంది. కొద్ది రోజులు అక్కడే ఉన్న తర్వాత అనుష్క తిరిగి భారత్‌కు రానుంది. కోహ్లీ మాత్రం అక్కడే ఉండనున్నారు. ఈ ఏడాది కోహ్లీకి మరుపురాని గుర్తుగా మిగిలిపోనుంది. అత్యుత్తమ ఆట తీరు కనబర్చిన కోహ్లీ, ఎంతో కాలంగా వినబడుతున్న రూమర్లకు తెరదించుతూ అనుష్క శర్మను వివాహం చేసుకున్నారు. పెళ్లి సందర్భంగా విరాట్‌ చేసిన ట్వీట్‌ గోల్డెన్‌ ట్వీట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ గా నిలిచింది

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top