పాక్‌ గర్ల్స్‌....మార్షల్‌ ఆర్ట్స్‌

Pakistani girls are learning Mixed Martial Arts to fight against sexual harassment.

దేశం ఏదైనా మహిళలపై లైంగిక దాడుల విషయంలో పెద్ద తేడా లేదు. ఇంట్లో ఉన్నా, బయటికెళ్లినా, కాలేజిల్లో, ఆఫీసుల్లో ఎక్కడ పడితే అక్కడ మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టడానికి ఏం చేయాలి ? చట్టాలు చేయాలా ? అబ్బాయిల తీరులో మార్పు తీసుకురావాలా ? లేదా ఆడ పిల్లలను కనకుండా ఉండాలా ? ఒక వేళ కన్న వారిని ఇంట్లో పెట్టి తాళం వేయాలా ? ఏం చేస్తే ఈ సమాజంలో అమ్మాయిలకు రక్షణ దొరుకుతుంది. దీనికి సమాధానంగా పాకిస్థాన్‌లో మహిళలు మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ను నేర్చుకుంటున్నారు.  

ఎవరైనా వారిపై ఏ విధమైన అఘాయిత్యానికి పాల్పడ్డానికి ప్రయత్నించినా వారిని ఏ కీలుకు ఆ కీలు విరగొట్టాడానికి, ఈ విద్యను నేర్చుకుంటున్నారు. సాధారణంగా ఎవరన్న ఇలాంటి విద్యను ఆత్మరక్షణ కోసం నేర్చుకుంటారు.  వారు మాత్రం ముఖ్యంగా లైగింక దాడులకు వ్యతిరేకంగా పోరాడ్డానికే కష్టపడి ఈ విద్యను నేర్చుకుంటుంన్నారంట !  ఎవరో వస్తారు నన్ను కాపాడతారు అని ఎదురుచూసే బదులు, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత వచ్చే పోలీసులను నమ్ముకునే బదులు ఇలా కొంచెం కష్టపడి మన ఆడపిల్లలు కూడా ఈ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ను నేర్చుకుంటే లైంగిక దాడులకు పాల్పడే మానవ మృగాలకు బుద్దొచ్చేల సమాధానం చెప్పొచ్చు. ఆడపిల్లలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్చగా బతకొచ్చు.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top